న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తేల్చిచెప్పింది. స్థానిక రిజర్వేషన్లను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు చేయాల్సిందేనన్నది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంకిత వేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం కొట్టివేసింది. ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోను ధర్మాసనం మరోమారు సమర్థించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





