ఖైరతాబాద్ స్థానం ఖాళీ

– గెజిట్ నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ అయింది. 2023లో బీఆరఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంతో పోటీ చేశారు. దీంతో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఆయన దానంకు అనుకూలంగా తీర్పు చెప్పారు. స్పీకర్ తీర్పుపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించగా దానంను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఈనెల 18న తీర్పునిచ్చింది. దీనిపై దానం సుప్రీం కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *