నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది

– నల్సార్‌ ‌ఘటనపై బీసీఐ జోక్యం సరికాదు
– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌
‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 :‌ నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ అన్నారు. హైదరాబాద్‌ నల్సార్‌ ‌నుంచి 2026లో గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా(బీసీఐ)ను ఆదేశించారు. అది తనకు, విద్యార్థులకు మధ్య సమస్య అని, బీసీఐ ఎందుకు జోక్యం చేసుకుందని అసహనం వ్యక్తం చేశారు. నల్సార్‌ ‌లా వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ అక్కడి విద్యార్థులు లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వారిపై బీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ నల్సార్‌ ‌యూనివర్సిటీ 2026 బ్యాచ్‌ ‌న్యాయశాస్త్ర విద్యార్థులెవరినీ న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దంటూ చైర్మన్‌ ‌మనన్‌కుమార్‌ ‌మిశ్రా  దేశవ్యాప్తంగా ఉన్న బార్‌ ‌కౌన్సిళ్లకు గురువారం లేఖ రాశారు. ఆ ఉత్తర్వులపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ ‌న్యాయవాది వికాస్‌ ‌సింగ్‌ ‌స్పందిస్తూ ‘రాజ్యాంగబద్ధమైన సంస్థతో విభేదించిన ఒక్క కారణంతో న్యాయవాద వృత్తిలో ప్రవేశించే హక్కును నిరాకరిస్తామని విద్యార్థులను బెదిరించకూడదు‘ అని వ్యాఖ్యానించారు. బీసీఐ తీరును సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ‘ఇదంతా పూర్తిగా అనవసరమైన పక్రియ. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ఇది నాకు, విద్యార్థులకు మధ్య జరిగిన విషయం. జోక్యం చేసుకోవడానికి వాళ్లెవ‌రు’ అని సీజేఐ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీఐ సర్క్యులర్లపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు  ఆదేశించింది. నల్సార్‌ ‌విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ నేపథ్యంలో బీసీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
———————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *