భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దు

– ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ పై అజిత్‌ దోభాల్‌ ఇం‌టర్వ్యూ
‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : ‌భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోభాల్‌ ‌హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై ఎన్‌ఎస్‌ఏ ఇం‌టర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. పహల్గాం దాడి తరువాత భారత్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టినప్ప‌టి పరిస్థితులపై అజిత్‌ ‌దోభాల్‌ ఈ ‌సిరీస్‌లో పలు కీలక వివరాలను వెల్లడించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌లక్ష్యాలు ఏమిటో ముందస్తుగానే నిర్ణయించుకున్నామని తెలిపారు. పహల్గాం దాడి వెనకున్న ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడమే తమ టార్గెట్‌ అన్నారు. ఉగ్రవాద చర్యలపై భారత్‌ ‌దీటుగా స్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్‌ ‌సిందూర్‌తో పంపామని చెప్పారు. ‘భారత దేశ సహనాన్ని బలహీనతగా భావించి పొరపాటు చేయొద్దు.. భారత్‌ ఎం‌తటి రిస్క్‌నైనా తీసుకోగలదు.. పర్యవసానాలను లెక్క చేయకుండా దాడులు చేయగలదు’ అని ఆయన అన్నారు. దోభాల్‌తో పాటు ఈ ఆపరేషన్‌ ‌వెనకున్న పలువురు అధికారులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీలో, డిస్కవరీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడులకు ప్రతీకారంగా భారత్‌ ‌గతేడాది మే7న ఆపరేషన్‌ ‌సిందూర్‌ను లాంచ్‌ ‌చేసిన విషయం తెలిసిందే.
————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *