‘సర్‌’ ‌విచారణ మీ ఇంటి వద్దే..

– కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ
– వోటుకు భద్రత కల్పించేలా నిర్ణయం

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను ఇచ్చింది. వోటర్లకు నష్టం జరగకుండా, ఇబ్బంది కలగకుండా వారి వోటుకు భద్రత కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌ఐఆర్‌ 2026 ‌ప్రక్రియను వోటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ ‌రెడ్డి తాజాగా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఈఓ సి.సుదర్శన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియలో భాగంగా వోటర్లను నోటీసులు అందుకోవడానికి లేదా అవసరమైన పత్రాలు సమర్పించడానికి కార్యాలయాలకు పిలవరాదని స్పష్టం చేశారు. బూత్‌ ‌లెవల్‌ అధికారులు వోటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు.ఇకపై సాధారణంగా వోటర్లను విచారణ కోసం కార్యాలయాలకు పిలవరాదని సీఈఓ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో విచారణ నిర్వహించాల్సి వస్తే ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త వోటరు నమోదు కోసం ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్‌ ‌తప్పనిసరిగా ఉండాలని సీఈఓ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ‌నిర్వహించని రాష్ట్రాల్లో డిక్లరేషన్‌ అవసరం లేకపోయినప్పటికీ తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు సందర్భంగా డిక్లరేషన్‌ ‌తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఈఆర్‌ఓ ‌కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7కు సంబంధించిన పెండింగ్‌ ‌దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. వోటర్లకు జారీ చేయాల్సిన పెండింగ్‌ ‌నోటీసులపై కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ఫారం-6, పెండింగ్‌ ‌నోటీసులు, ఫారం-7, ఫారం-8కు సంబంధించిన వివరాలను అన్ని స్థాయిల్లోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందించాలని సీఈఓ ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌-2026 ‌ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దశను పారదర్శకంగా పూర్తి చేయాలని సీఈఓ సి. సుదర్శన్‌ ‌రెడ్డి సూచించారు. ఇక తాజా ఆదేశాలతో విచారణకు రాని వారి ఇళ్ళకు నేరుగా బీఎల్‌ ‌వోలు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్ ‌తీసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *