– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 11: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని సీఈఓ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం త్వరలో ప్రక టించనున్నందున, మ్యాపింగ్ పక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరు వరకు 90 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. మ్యా పింగ్ కార్యక్రమానికి సహకరించేందుకు వివిధ రెసిడెన్షియల్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలను కలుపుకోవాలని, అలాగే ప్ర భుత్వ ఉద్యోగులందరూ సంబంధిత బిఎల్ వో లసంప్రదించి స్వచ్ఛందంగా మ్యాపింగ్ చేయించుకోవాలని సీఈఓ కోరారు. గేటెడ్ క మ్యూనిటీలు, స్లమ్ ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ మ్యాపింగ్ పక్రియను చేపట్టాలని ఆయన సూచించారు. ఓటర్లకు మ్యాపింగ్లో సహా యం అందించేందుకు సూపర్వెజర్ స్థాయి అధికారులు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చే యాలని ఆయన ఆదేశించారు. అదేవి ధంగా, స్వయం సహాయక సంఘాలు, రేషన్ షాప్ డీలర్లు, ఉద్యోగ సంఘాలను కూడా ఈ మ్యా పింగ్ పక్రియలో భాగస్వామ్యం చేయాలని కోరారు. మరణించిన, వలస వెళ్లిన, శాశ్వ తంగా చిరునామా మార్చుకున్న ఓటర్ల వివ రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, విధి విధానాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే తమ నియోజకవర్గాలలోని,వోటర్ల మ్యాపింగ్ ను కూడా చేపట్టాలని సూచించారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, మ్యాపింగ్ పురోగతిని సక్షించే లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓ ఆదేశించారు. అనధికార వ్యక్తులతో ఎటువంటి సమాచారం పంచుకోవద్దని సీఈ ఓ హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్లను లేదా వోటర్లను గుర్తించ డంలో మాత్రమే బిఎల్వోల సహాయం తీసు కోవాలని ఆయన చెప్పారు. తప్పుగా జరిగిన మ్యాపింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని తక్షణమే సరిచేయాలని ఆయన ఆదేశించా రు. జిల్లా స్థాయిలో ముద్రిత, ఎలక్ట్రాన్రిక్ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వ హించాలని కలెక్టర్లను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ప్రధాన ఎన్నికల అధి కారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, నోడల్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్, సాంకేతిక సిబ్బంది. అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



