– సంచలనంగా సునీతా కృష్ణన్ పోస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘ సేవకురాలు సునీతా కృష్ణన్ తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ‘తల్లిదండ్రులందరినీ అభ్యర్థిస్తున్నా.. ఒకవేళ కొడుకు లైంగిక దాడులు చేస్తే అతన్ని కాపాడే ప్రయత్నం చేయకండి.. ఇలాంటి తప్పులు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని వారికి తెలిసేలా చేయడం వల్ల సమాజానికి మీరు గొప్ప సేవ చేసినవారవుతారు’ అని ట్వీట్ చేశారు. సునీతాకృష్ణన్ బండి సంజయ్ కుమారుడి కేసును గుర్తు చేస్తూ పరోక్షంగా చేసిన ఈ ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తున్నది.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



