– 30న సిరిసిల్లకు ముఖ్యమంత్రి
– మంత్రి తుమ్మల
– బహిరంగ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
– మంత్రి తుమ్మల
– బహిరంగ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు బైపాస్ రోడ్ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగితెతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 33 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. రైతులు, నేతన్నలు, అన్ని వర్గాల ప్రజలు లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 30న కరీంనగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించడంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, ఈ సందర్భంగా 33 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అదే సమయంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడనున్నారన్నారు. 33 నెలల ప్రజా ప్రభుత్వం సంక్షేమ రంగంలోనే కాకుండా వ్యవసాయం, సాంకేతిక రంగం, మౌలిక వసతులు, సాగునీరు, విద్య, ఉపాధి తదితర అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా నేతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. చలో సిరిసిల్ల ద్వారా ప్రజా పాలన విజయాన్ని చాటుదామని పిలుపునిచ్చారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





