నీరు నీరేలే
ఉప్పు నీరేలే
కళ్లల్లో ఉప్పు నీరేలే
చెమటల్లోను
కష్టాల కడలి లోను
ఉప్పు ఉప్పు నీరేలే…

తిండి లోను ఉప్పు
శరీరం లోను ఉప్పే
ఉప్పు మోతాదు మించిన
ఉప్పు మోతాదు తగ్గిన
నాడి వ్యవస్థ నాశనం
మందులతో ఇక సహజీవనం…

ఉప్పు లేకుండా ముద్ద దిగదు
ఉప్పు పై తెల్లవాళ్లు పన్ను వేసారు
ఉప్పు సత్యాగ్రహం చేసారు గాంధీజీ
ఉప్పుచరిత్ర గా మిగిలింది….

నీరు నీరేలే
పేదల కళ్లల్లో
ఉప్పు నీరేలే
నిద్రలో కనుకొనలలో
జారి జారి నిద్రను వెలి వేస్తుంది…

పర్వత సానువల్లోపుట్టి
చీలిక లై పాలిక లై
బాధల రొదలో నది
సంద్రం లో ఉప్పై తల్లడిల్లుతుంది
మానవ మనుగడ లోను
జనసద్రం లోను
ఉప్పుగా మిగులుతుంది…

కల్లోల కడలి అలల్లో
ఉప్పుచిటపటలు
కల్లోల మనిషి లోను
జారే కన్నీటి లో
చితి చిటపటలు…

ఒలికే చెమట నీరు
చప్పగా ఉండే పేద బతుకులు
చప్పగా సాగే సామాన్య బతుకులు
వారి వారి బతుకుల కథలన్నీ
ఉప్పు ఉప్పు గానే ఉంటాయి

 -రేడియమ్
9291527757

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *