సదర్ సమ్మేళనం ప్రజలందరి ఆత్మగౌరవ ఉత్సవం

– ఈ ఉత్సవానికి రూ.5 కోట్ల నిధులు
– నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర మరవలేనిది
– మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో యాదవుల సహకారం అవసరం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: సదర్ సమ్మేళనం కేవలం యాదవులకే కాదు. రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మగౌరవ సమ్మేళనమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో సీఎం పాల్గొని యాదవ సోదరులం దరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ నగర చరిత్రలో యాదవుల పాత్ర ఆపార మైనదని కొనియాడారు. నేటి గోల్కొండ కోట ఒకనాటి ‘గొల్లంకొండ’ అని గుర్తుచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకోవడం వల్లే ఈ నగరం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు.

సదర్ పండుగకు రూ.5 కోట్లు 

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని, యాదవుల కోరిక మేరకే తమ కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ ను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంలో యాదవులకు తగిన గుర్తింపు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడంతోపాటు ఈశ్వరమ్మ యాదవ్ ను యాద గిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించామని గుర్తుచేశారు. యాదగిరిగుట్ట గోశాలలో శాశ్వత ప్రాతిపదికన గోసంరక్షణ చేపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణలో కులగణన ప్రక్రియను పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర‌ అభివృద్ధికి యాదవుల సహకారం అవసరం

తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, ‘భారత్ ప్యూచర్ సిటీ’ నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లా ల్సిన అవసరం ఉందని, ఈ వికాస ప్రస్థానంలో యాదవ సోదరుల సహకారం నిరంతరం ఉండాలని సీఎం పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *