కుటుంబ కలహాలతో ఇద్దరు మహిళల హత్య

– మీర్‌పేటలో ఘాతుకం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : మీర్‌పేట్ జయశ్రీ కాలనీలో జంట హత్యల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు సిద్ధిఖ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడిలో నిందితుడి అత్త నిరంజన్ బీ, అతని బావమరిది యూసుఫ్ భార్య రేష్మ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నిందితుడి భార్య, కూతురుతోపాటు యూసుఫ్ కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా, తమకు సిద్ధిఖ్ నుండి ప్రాణభయం ఉందంటూ బాధితులు బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరినట్లు సమాచారం. అయితే వారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నిందితుడు గొడవకు దిగి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. హత్యలకు పాల్పడిన అనంతరం నిందితుడు సిద్ధిఖ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *