మురసు తుఫాన్ బాధిత రైతులను ఆదుకుంటాం

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 
– ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన, అధికారులతో సమీక్ష
– 2-3 రోజుల్లో నష్టం అంచనాలు పంపాలని కలెకర్ల‌కు ఆదేశం

ఖమ్మం/దమ్మపేట, ప్రజాతంత్ర, నవంబర్ 5 : మురసు తుఫానులో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావంతో భారీగా వరద నీరు చేరి దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి  గురువారం పర్యటించారు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో తెగిన చెరువు కట్టలు, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్ లతో కలిసి బేతుపల్లి పెద్ద చెరువు ముంపు ప్రాంతాలను, అలాగే దమ్మపేట మండలం నాగుపల్లి వద్ద మల్లెపూల వాగు ఉప్పొంగడంతో దెబ్బతిన్న పంటలను పరి శీలించారు. గండుగులపల్లి వద్ద వాగు పరిస రాల్లో దెబ్బతిన్న కట్టను, దమ్మపేటలో తెగిపో యిన పేరంటాల చెరువు కట్టను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి, సహా యక చర్యలు, చేపట్టాల్సిన మరమ్మతులపై అ ధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సత్తుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలోకి వరద నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించారు.

భద్రాద్రి, ఖమ్మం అధికారులతో ప్రత్యేక సమీక్ష

వరద విపత్తుపై అధికారులు సమన్వయంతో తీసుకున్న చర్యలు, ప్రాణనష్టం లేకుండా చేపట్టిన చర్యలను మంత్రి పొంగులేటి  అభినందించారు. సింగరేణి కాలరీస్ గెస్ట్ హౌజ్ లో బేతుపల్లి వరద సహాయక చర్యలు, వరద ముంపు నష్టాలపై ఖమ్మం, కొత్త‌గూడెం భ‌ద్రాద్రి కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వరావుపేట ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోట్లు బోల్తా సంఘటనపై కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం వలన పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. 2023 డిసెంబర్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2024 ఆగస్టు చివరలో మున్నేరు వాగు ఊహించని రీతిలో సుమారు 76-77. అడుగుల ఎత్తుతో ప్రవహించినప్పుడు భారీ నష్టం వాటిల్లిందని, అప్పట్లో ఎన్డీఆర్ఎఫ్ దగ్గర తగిన పరికరాలు లేకపోవడాన్ని గమనించిన ముఖ్యమంత్రి, మంత్రులు భవిష్యత్తును దృ ష్టిలో ఉంచుకుని ఈ విపత్తు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పోలీసు శాఖ నుంచి 1200మందిని, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 700 మందిని ఎంపిక చేసి ఎన్డీఆర్ఎఫ్ ను పటిష్టం చేయడంతోపాటు మొత్తం 1,900 మంది సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. సుమారు రూ. 60-270 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను ఎస్టీ ఆర్ఎఫ్ కు ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఏ మూలన విపత్తు వచ్చినా 45 నుండి 50 నిమిషాల లోపు సహాయక చర్యలు అందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం, సత్తుపల్లి తదితర ప్రాంతాలలో విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్అండ్ బి, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించా లన్నారు. కొన్ని ప్రాంతాలలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తెగడం, చెరువులు పొంగిపొర్లడం వల్ల కింద ఉన్న వరి ఇతర పంటలు దెబ్బతిన్నాయనారు. మల్లెపూవు వాగు ప్రవహించడం వల్ల డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. రోడ్లపైకి చెత్తాచెదారం, వరద నీరు చేరడం వల్ల కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ రోడ్లకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు.  రానున్న 2-3 రోజుల్లోగా నష్టానికి సంబం ధించిన పూర్తిస్థాయి అంచ‌నాలు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించామ‌న్నారు. సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *