– ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య అరెస్ట్
సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: చిట్టీ ల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతడి భార్యను చివ్వెంల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమా వేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలను వెల్లడించారు. చివ్వెంల మండలం యెనగండి తండాకు చెందిన బానోత్ రాజు (44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ భార్య అనూష (33) సహకారంతో 2015 నుంచి చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అధిక రాబడులు, నెలవారీ చెల్లింపులు ఇస్తామని నమ్మించి ప్రజలు, తోటి ఉద్యోగులు, పరిచయస్తుల నుంచి భారీగా నగదు సేకరించినట్లు, భూములు కొనుగోలు చేస్తున్నామని నమ్మించి పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. చిట్టీల గడువు పూర్తయినప్పటికీ నగదు తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. సేకరించిన నగదులో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని సుమారు 500 మందికి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు నెలకు 10 శాతం వరకు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చినట్లు గుర్తించామన్నారు.
రూ.3.05 కోట్ల బకాయిలు
బాధితుల నుంచి రూ.6,24,50,000 సేక రించినట్లు ఇప్పటివరకు గుర్తించామని డీఎ స్పీ తెలిపారు. ఇందులో రూ.3.18,54,000 తిరిగి చెల్లించగా మరో రూ.3,05,96,000 చెల్లించాల్సి ఉందన్నారు. నగదు లావాదేవీ లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూముల లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
బాధితులు సంప్రదించాలి
రాజు, అనూష చేతిలో మోసపోయిన ఇతర బాధితులు ఆధారాలతో వెంటనే చివ్వెంల పోలీసులను సంప్రదించాలని డీఎస్సీ కోరా రు. అధిక రాబడులు, చిట్టీలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. నిందితు లను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సూర్యా పేట రూరల్ సీఐ జి.రాజశేఖర్, ఎస్ఐలు వి. మహేశ్వర్, వెంకన్నతో పాటు సిబ్బంది జనా ర్దన్రెడ్డి, వెంకటేష్లను అధికారులను డిఎస్పి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




