కాంగ్రెస్ శకం ముగిసింది

– కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు
– ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు
– మాజీ మంత్రి హరీశ్ రావు 

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి హరీష్ రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ శకం ముగిసిందన్నారు. సాధారణంగా ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వలసలు ఉంటాయని, కానీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ నుంచి నేతలు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ లోకి రావడం అసాధారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదని, రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనుల వైఫల్యం కారణంగా ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారని, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండటం కంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడమే మేలని భావించి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును ఆయన ‘ఫ్యూచర్ లేని సిటీ’గా ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఉన్న నివాస ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *