డిప్యూటి సిఎం భట్టి ఇంట్లో చోరీ

నగదు, బంగారంతో పరార్‌.. ‌బెంగాల్లో పట్టుకున్న పోలీసులు

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్‌ 2 ‌ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెంబర్‌ 14‌లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది.

ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలించగా.. వారంతా పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్‌ ‌రైల్వే స్టేషన్‌లో బెంగాల్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. నిందితులు బీహార్‌కు చెందిన రోషన్‌ ‌కుమార్‌ ‌మండల్‌, ఉదయ్‌ ‌కుమార్‌ ‌ఠాకూర్‌గా గుర్తించారు.

వీరి వద్ద నుంచి రూ. 2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌ ‌పోలీసులు నిందితులను అరెస్ట్ ‌చేయడంతో.. వారిని అదుపులోకి తీసుకునేందుకు బంజారాహిల్స్ ‌పోలీసులు బెంగాల్‌కు వెళ్లారు. ఇదిలా ఉండ‌గా ఇటీవల టాలీవుడ్‌ ‌సీనియర్‌ ‌నటుడు మంచు మోహన్‌ ‌బాబు ఇంట్లోనూ చోరీ జరిగింది.

ఇంట్లో పని చేసే వ్యక్తే ఈ చోరీకి పాల్పడ్డాడు. ఏకంగా రూ. 10 లక్షలు ఎత్తుకెళ్లాడు. మోహన్‌ ‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దొంగను పట్టుకున్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగడం సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *