నల్లగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జిల్లాలోని నాంపల్లి తహసీల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) గోపరాజును, అతని అసిస్టెంట్ యాదగిరిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ రైతు పౌతి కోసం ఆర్ఐని సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. సోమవారం అతడి అసిస్టెంట్ యాదగిరి రూ.15 వేలు తీసుకుని ఆర్ఐకి అప్పగించగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





