– మండుతున్న ఎండలు!
హైదరాబాద్, ప్రజాంత్ర, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు కాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజలు వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా హైదరాబాద్ లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలకు బదులుగా ప్రస్తుతం 34 డిగ్రీలుగా నమోదవుతున్నది. ఎల్ నినో ప్రభావం వల్లే వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్ర తలు మరో 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





