ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : కోవిడ్ సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు. బీఆరఎస్ ప్రభుత్వ కాలంలో 2021 ఏప్రిల్ 11వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో మాస్కులు ధరించకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పాల్గొన్నారని అప్పుడు టీపీసీసీ అథ్యక్షుడిగా ఉన్న ఎ.రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు వచ్చింది. సీఆర్‌పీసీ 313 కింద నిందితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు కోర్టు విచారణ చేపట్టగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *