– కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వారికి కనీస సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేసే దిశగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు న్యాయం జరగాలని ఆకాంక్షించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, వారి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
14న రాహుల్ గాంధీ పర్యటన – గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ
ఈ నెల 14న జరగనున్న భారత్ సమ్మిట్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు విచ్చేస్తున్నారని మంత్రి వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల ఆధ్వర్యంలో శిల్ప కళా వేదిక నుండి హెచఐసీసీ వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొని గిగ్ వర్కర్లతో మమేకమవుతారన్నారు. గిగ్ వర్కర్ల సౌలభ్యం, భద్రత కోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను తీసుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క గిగ్ వర్కర్ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





