మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు

– ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవి
– సంచలన తీర్పు వెల్లడించిన మద్రాస్‌ ‌హైకోర్టు

మద్రాస్‌, ‌జూన్‌ 26: ‌మత మార్పిడులు, రిజర్వేషన్ల ప్రయోజనాలపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాల నుండి ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతి ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు కొట్టివేసింది. 2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం (వనుకబడిన తరగతి, అత్యంత వెనుకబడిన తరగతి, డినోటిఫైడ్‌ ‌కవ్యనిటీస్‌, ‌షెడ్యూల్డ్ ‌కులాలకు చెందిన వ్యక్తులు ఇస్లాం మతంలోకి మారినప్పటికీ వారికి బీసీ ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను కొనసాగించవచ్చని పేర్కొంది. అంతేకాక ప్రభుత్వం నోటిఫై చేసిన ఏడు ప్రత్యేక బీసీ ముస్లిం వర్గాలలో ఒకదానికి చెందిన సభ్యులుగా వారిని గుర్తిస్తూ కమ్యూనిటీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి కూడా ఈ ఉత్తర్వు అనుమతించింది. తమిళనాడు ప్రభుత్వ భావన చట్టపరంగా, భావనాత్మకంగా పూర్తిగా తప్పని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి వెనుకబడిన తరగతి ముస్లిం హోదాను పొందలేరని మేము నిర్ధారిస్తున్నాము.. మతం మారిన వ్యక్తి కేవలం ఒక ముస్లిం మాత్రమే అవుతాడు,. అంతే తప్ప ప్రత్యేక వర్గానికి చెందడు’ అని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రత్యేక వెనుకబడిన ముస్లిం వర్గాలలో అన్సార్‌, ‌దక్కనీ ముస్లింలు, దుబేకుల, లబ్బాయి, మాపిళ్ళ, షేక్‌, ‌సయ్యద్‌ ఎవరైనా కొత్తగా మతం మారిన వారిని సభ్యునిగా పరిగణించడం సాధ్యం కాదని, అందువల్ల వారు ఆ వర్గం కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులు కారని కోర్టు తేల్చి చెప్పింది. జూలై 2008లో జారీ చేసిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా తమిళనాడులోని పైన పేర్కొన్న ఏడు ముస్లిం వర్గాలను ప్రత్యేక కేటగిరీలో చేర్చారు. అయితే, ఇతర సామాజిక వర్గాల నుండి ఇస్లాంలోకి మారిన వారికి కూడా ఈ సర్టిఫికెట్లు ఇవ్వాలనే 2024 నాటి ప్రభుత్వ నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వానికి న్యాయ‌ప‌రంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *