గూడూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: గూడూరు సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో మరోసారి ఎలుకలు కలకలం సృష్టించాయి. మరో విద్యార్థినిని ఎలుకలు కొరికి గాయం చేయడంతో మిగతా విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందారు. పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరకడంతో కాలు కింది భాగంలోని గాయమైంది. విషయం తెలుసుకున్న తహసిల్దార్ నాగభవాని పాఠశాలకు చేరుకొని విద్యార్థినితో మాట్లాడి ఆరా తీశారు. వెంటనే ఆమెను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో మరో విద్యార్థినిపై ఎలుకలు దాడి చేసినట్లు విద్యార్థులు ఈ సందర్భంగా తహసిల్దార్ దృష్టికి తీసుకువచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





