– చింతన్ శివిర్‌లో గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ
– ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి
– ఎన్‌హెచ్ 65 6+2 లేన్ల విస్తరణ, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేపై చర్చ
– పర్వతమాల కింద 5 రోప్‌వేలు, సీఆర్ఐఎఫ్ కింద 33 పనులు
– 3 ఆర్వోబీ/ఆర్యూబీలకు మంజూరు కోరిన మంత్రి
– హైదరాబాద్-శ్రీశైలం ఎన్‌హెచ్-765పై ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రత్యేక విజ్ఞప్తి
– ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి
– ఎన్‌హెచ్ 65 6+2 లేన్ల విస్తరణ, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేపై చర్చ
– పర్వతమాల కింద 5 రోప్‌వేలు, సీఆర్ఐఎఫ్ కింద 33 పనులు
– 3 ఆర్వోబీ/ఆర్యూబీలకు మంజూరు కోరిన మంత్రి
– హైదరాబాద్-శ్రీశైలం ఎన్‌హెచ్-765పై ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రత్యేక విజ్ఞప్తి
గుజరాత్(ఏక్తానగర్), ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ఇన్ఫ్రాపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గుజరాత్ రాష్ట్రం నర్మద జిల్లాలోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో జరుగుతున్న చింతన్ శివిర్- 2026 రెండు రోజుల కార్యక్రమాన్ని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజు సమావేశంలో పలు రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వంటి వివిధ అంశాలపై జరిగిన చర్చ అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల మంజూరీలు, జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, సేతు బంధన్, సీఆర్యూఐఎఫ్ పనులకు కేంద్రం అందిస్తున్న సహకారానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతోపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేలా పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని గడ్కరీని కోరారు.
ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు సుమారు 6 కి.మీ. మేర డబుల్ డెక్కర్ విధానంలో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని మంత్రి కోరారు. ఇప్పటికే ఎన్‌హెచ్-65లో ఎల్బీనగర్-మల్కాపూర్ సెక్షన్‌ను సర్వీస్ రోడ్లు సహా ఆరు(6+2) లేన్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.545 కోట్లతో కేంద్రం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఎక్కువగా నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో ఆరఈ వాల్‌కు బదులుగా వయాడక్ట్ విధానంలో నిర్మాణం చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. మియాపూర్-ఎల్బీనగర్ మెట్రో రైలు రెండో దశ కారిడార్‌ను హయత్‌నగర్ వరకు పొడిగించేందుకు రాష్ట్రం నిర్ణయించిన నేపథ్యంలో మెట్రోతో సమన్వయం ఉండేలా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు 2026-27 వార్షిక ప్రణాళికలో చోటు కల్పించి మంజూరు చేయాలని కోరారు.
పర్వతమాల కింద 5 రోప్‌వే ప్రాజెక్టులు
పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు పర్వతమాల పథకం కింద రూ.1,230 కోట్ల అంచనాతో ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నల్గొండ హనుమాన్ హిల్, నాగార్జునసాగర్-నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లా మంథని రామగిరి కోట, నిజామాబాద్ కిల్లా రామాలయం ప్రాంతాల్లో ఈ రోప్‌వేలను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవి భక్తులు, పర్యాటకులు, స్థానిక ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతోపాటు పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దోహదపడతాయని వివరించారు.
మూడు కీలక ఆర్వోబీ, ఆర్యూబీలకు మంజూరు
2026-27కు సేతు బంధన్ పథకం కింద మూడు కీలక ఆర్వోబీ/ఆర్యూబీ ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వాలని మంత్రి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బైపాస్ వద్ద నాలుగు లేన్ల ఆర్వోబీ, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ వద్ద రెండు లేన్ల ఆర్వోబీ, నల్గొండ జిల్లాలో పగిడిపల్లి-నడికుడి రైల్వే సెక్షన్లో నాలుగు లేన్ల ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్‌హెచ్-65 ఆరు లేన్ల విస్తరణకు వేగంగా ఆమోదాలు
తెలంగాణ-ఏపీ రాష్ట్రాలను కలిపే హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్ 65ను ఆరు(6G2) లేన్లుగా విస్తరించే ప్రాజెక్టును వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి గడ్కరీని కోరారు. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ 1.20 లక్షలకు పైగా పీసీయÖకు చేరిందని, అనేక ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లు ఉన్నాయని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రహదారిని విస్తరించడంతోపాటు రోడ్డు భద్రతను మెరుగుపరచడం అత్యవసరమని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అలైన్మెంట్ ఆమోదం, పీఏటీఎస్సీ, పీపీపీఏసీ ఆమోదాలు ఇప్పటికే లభించాయని, సీసీఈఏ ఆమోదం కోసం సిఫారసు చేసిన నేపథ్యంలో త్వరగా తుది ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్‌హెచ్ 765పై ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్-శ్రీశైలం ఎన్‌హెచ్ 765లో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్‌కు మంజూరు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలో రహదారి విస్తరణకు ఎదురవుతున్న సమస్యలకు ఎలివేటెడ్ కారిడార్ పరిష్కారంగా నిలుస్తుందని, శ్రీశైలం వెళ్లే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడంతోపాటు నల్లమల అటవీ ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు.
33 పనులకు రూ.1,227.75 కోట్ల మంజూరు కోరిన మంత్రి
2026-27 ఆర్థిక సంవత్సరానికి సీఆర్ఐఎఫ్ పథకం కింద రాష్ట్రంలో 33 రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోమటిరెడ్డి కోరారు. మొత్తం 511.68 కి.మీ పొడవుతో చేపట్టనున్న ఈ పనులకు రూ.1,227.75 కోట్ల అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన ఈ పనులు రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని, వీటిని పరిశీలించి 2026-27 సీఆర్ఐఎఫ్ పథకం కింద మంజూరు చేయాలని గడ్కరీని కోరారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి ఆర్థిక, కేబినెట్ ఆమోదం తెలపాలి
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)లోని ఉత్తర భాగానికి ఆర్థిక, కేంద్ర మంత్రివర్గ ఆమోదం త్వరగా ఇవ్వాలని కోమటిరెడ్డి కోరారు. సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ మార్గంలో 161.518 కి.మీ మేర నిర్మించనున్న ఆరఆరఆర్ ఉత్తర భాగానికి భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్రం భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 90 శాతానికి పైగా భూములకు అవార్డులు ఆమోదమయ్యాయని, ఎన్హెచ్ఏఐ టెండర్లు కూడా ఆహ్వానించినందున వీలైనంత త్వరగా ఆర్థిక, కేబినెట్ ఆమోదాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ పూర్తి రింగ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతో సమానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక పార్కులు, రేడియల్ రోడ్లు తదితర భవిష్యత్ మౌలిక వసతులకు దక్షిణ ఆర్ఆర్ఆర్ కీలకంగా మారుతుందని వివరించారు.
హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
తెలంగాణ, ఏపీల మధ్య భవిష్యత్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి డీపీఆర్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కోరారు. దీన్ని తెలంగాణలోని డ్రైపోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా సరకు రవాణా సులభతరం అవుతుందని, ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. బందర్ పోర్టుకు స్పర్ కనెక్టివిటీ కల్పించే అవకాశం కూడా ఉందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులన్నింటినీ సానుకూలంగా పరిశీలించి అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు, కేబినెట్ ఆమోదాలను త్వరితగతిన పూర్తి చేసి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, చీఫ్ ఇంజనీర్లు బి.వి.రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్, పలువురు అధికారులు ఉన్నారు.
—————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





