- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్‌రెడ్డి ఎంపికపై సర్వత్రా హర్షం
-
నాలుగు తరాల కాంగ్రెస్ కుటుంబ వారసుడిగా గుర్తింపు
-
విద్య, ఉపాధి, పట్టభద్రుల సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం
-
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి..
-
రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో సరికొత్త చర్చ
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి (Ramreddy Sarotham Reddy) పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడిగా రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఆయన.. ఆ వారసత్వానికే పరిమితం కాకుండా ఉన్నత విద్య, అంతర్జాతీయ వృత్తి అనుభవం, వ్యాపార రంగంలో అపారమన అనుభవాన్ని తన రాజకీయ ప్రస్థానంతో మేళవించే యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ సంస్థాగత కార్యకలాపాలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. భూమి, మౌలిక వసతులు, స్థానిక అభివృద్ధి వంటి సమస్యలతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపిక చేయడంతో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం మరో కీలక దశలోకి ప్రవేశించింది. విస్తృత భౌగోళిక పరిధి కలిగిన ఈ నియోజకవర్గంలో భిన్నవర్గాల పట్టభద్రులతో ఎలా అనుసంధానం అవుతారు.. వారి సమస్యలను ఏ విధంగా తన రాజకీయ ఎజెండాలోకి తీసుకువెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో విస్తృతంగా వినిపిస్తున్న పేరు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టభద్రుల ఎన్నికల కోసం నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా మార్మోగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దివంగత మాజీ మంత్రి రాంరేెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు
సర్వోత్తమ్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రయాణంలో ఆయనకు లభించిన రాజకీయ వారసత్వం మాత్రమే కాదు. ఆ వారసత్వాన్ని ప్రస్తుత తరానికి అనుగుణంగా ప్రజా సమస్యలు, యువతతో అనుసంధానం, పార్టీ కార్యకలాపాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నం కూడా. అందువల్ల ఆయన రాజకీయ నేపథ్యాన్ని కేవలం వ్యక్తిగత రాజకీయ ప్రయాణంగా కాకుండా దీర్ఘకాల కాంగ్రెస్ కుటుంబ రాజకీయ వారసత్వానికి కొనసాగింపుగా చూడవచ్చు.
విద్య, వృత్తిపరమైన నేపథ్యం
సర్వోత్తమ్ రెడ్డి స్వతహాగా విద్యావంతుడు. పాఠశాల, కళాశాల విద్యలో ప్రథమ స్థానంలో ఉండేవాడు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి అమెరికాలో ఎంబీఏ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యలో గోల్డ్ మెడల్ సాధించడం ఆయన మేధస్సుకు నిదర్శనం. 2002 నుంచి 2012 వరకు బిజినెస్ అనాలసిస్ మార్కెటింగ్, ఆపరేషన్ విభాగాలలో బాధ్యతాయుతమైన పదవులను నిర్వర్తించారు. కాపిటల్ వన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి అతి పెద్ద కార్పొరేట్ సంస్థలో బాధ్యతలు నిర్వర్తించడం ఆయన ప్రతిభను తెలియజేస్తుంది. అమెరికా కెనడా యూకే వంటి దేశాలలోనూ వృత్తిపరమైన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన వ్యవసాయంతో పాటు పాల, ఉద్యాన, సోలార్ ఎనర్జీ, ఆతిథ్య రంగం, ఎలక్ట్రికల్ పరికరాలు, నిర్మాణ సామగ్రి వంటి వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.
నాలుగు తరాల వారసత్వం
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 2012 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా కొనసాగుతున్నారు. ఏఐసీసీ సభ్యులుగా ఉంటూ సంస్థాగత మరియు రాజకీయ రంగాలలో 14 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం ఉంది. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తూ సమన్వయం చేస్తున్నారు. 2014, 2019, 2024 ఎన్నికలలో భువనగిరి లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వ పోటీదారులలో ప్రముఖంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన నాలుగు తరాల కాంగ్రెస్ కుటుంబానికి చెందినవారు. యువత ప్రాతినిధ్యం, క్షేత్రస్థాయి భాగస్వామ్యం, సంస్థాగత అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ భావితరాల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నారు.
అందరినీ కలుపుకునే తత్వం
కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి పెట్టిన పేరు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గాలు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అలాగే సూర్యాపేట కాంగ్రెస్ రాజకీయాలలో అంతర్గత విభేదాలపై ఇటీవల కొన్ని మీడియా కథనాలు సైతం వెలుపడ్డాయి. ఈ క్రమంలో సర్వోత్తమ్ రెడ్డి వేసిన అడుగులు అందరిని ఆశ్చర్యపరిచాయి. అప్పటివరకు ఉన్న వర్గాలను, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అందరిని కలుపుకుంటూ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఆయన వ్యూహాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎవరినైనా పక్కకు నెట్టే రాజకీయాల కంటే అందర్నీ కలుపుకొని వెళ్లే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తు ఆయన చేస్తున్న సమన్వయ రాజకీయం అత్యంత కీలకమైన అంశంగా కనబడుతుంది.
ప్రజా సేవలో తరిస్తూ..
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తు వచ్చేది ఆయన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలలో ఆయన చేసిన సేవ, రాష్ట్ర రాజకీయాలలో దామోదర్ రెడ్డి పేరు ప్రత్యేకమైనది. ప్రస్తుతం సర్వోత్తమ్ రెడ్డి కూడా అదే రాజకీయ వారసత్వాన్ని ముందుకు వెళ్తున్నారు. అయితే సర్వోత్తమ్ రెడ్డి ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూడటమే కాకుండా ఆయా సమస్యలపై ఆయన స్పందించిన తీరు ఆయనను ప్రజానాయకుడిగా నిలబెడుతోంది. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను విని సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజలలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. భూమి సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, స్థానిక అభివృద్ధి సమస్య అయినా.. సమస్య ఉన్న ప్రదేశానికి వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం వల్ల ప్రజల్లో ఆయనపై నమ్మకం మరింత బలపడింది. సమస్యను వినడం ఒక దశ అయితే సమస్య పరిష్కారం కోసం వ్యవస్థను కదిలించడం మరోదశ, ఆ దశనే ఆయన రాజకీయ భవిష్యత్తును బలంగా మార్చింది.
సమస్యలు చెప్పుకునేందుకు సరైన వేదిక
విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలి..చదువుకున్న యువతకు ఉద్యోగం కావాలి.. పట్టభద్రులకు తగిన అవకాశాలు కావాలి.. ఈ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. కేవలం అవగాహన మాత్రమే కాదు పట్టభద్రులు గొంతుకగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం పోరాడే స్వభావం కలిగిన వ్యక్తి కూడా కావడం మరో విశేషం. పట్టభద్రుల సమస్యలను తన సమస్యగా భావించే గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి సర్వోత్తమ్ రెడ్డి. మొదటి నుంచి కూడా ఆయన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సైతం ప్రజా సమస్యలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. రాజకీయాలలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే వేలకోట్లు సంపాదించే ప్రస్తుత తరుణంలో రాజకీయాలలోకి వచ్చి వేల ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చిన ఘనత వారి కుటుంబానిది. డబ్బు సమూపార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజా సమస్యలు, పట్టభద్రుల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇటువంటి విద్యధికుడు, ప్రజా సమస్యలు తెలిసినవాడు.. వ్యవసాయ రంగంపై మక్కువ కలిగిన వాడు.. రాజకీయాలలో ఉండడం సామాన్య ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి వ్యక్తిని గెలిపించడం వలన సామాన్యులు సైతం తమ సమస్యలను చెప్పుకొని పరిష్కరించుకునే ఒక వేదికను పొందగలుగుతారు.





