‘గౌరు’ రాక ఎవరికి ఎసరు?

– పార్టీలో చేరేందుకు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రెడీ
– వ్యతికేరిస్తున్న సీనియర్లు
– తూర్పు, పశ్చిమలపై వారి పెత్తనం ఏమటని మాజీల గుర్రు
– రేప‌టి సభలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆ పార్టీలో చిచ్చురే పుతోంది. వరంగల్లో పార్టీని పటిష్ట చేసేందుకు రాష్ట్ర నాయకత్వం కొత్త వ్య‌క్తిని పార్టీలోకి తీసుకురావాలని భావిస్తోంది. రానున్న బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ మేయర్ గా  నిలిపే అభ్యర్థికి దీటుగా ఉండేలా నగరానికి చెంది అందరికి సుపరిచతుడై, పేరున్న వ్యక్తి, వ్యయప్రయాసలను తట్టుకుని ఉండే వ్యక్తి కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. ఇందుకోసం ఇటీవలే జాతీయ పార్టీలో చేరి మళ్లీ పార్టీలోకి వచ్చిన మాజీతోపాటు అర్బన్ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. వీరికి రాజకీయాల్లో గత ఎన్నికల్లో మినహా ఓటమి ఎరగని సీనియర్ నాయకులు ఆశీస్సులు తోడు కావడంతో రాష్ట్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకే పార్టీలో తిరుపతి రెడ్డి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు పడి పదేళ్లు ప్రభుత్వం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక ఎదురు చూపులు చూస్తున్న సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉడికిపోతున్నారు. గ్రేటర్ లో ఎక్కువ డివిజన్లు ఉన్న తమని సంప్రదించకుండా రూరల్ నేపథ్యంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల పెత్తనం ఏమిటని తాజా మాజీలు తమ అనుచర వర్గం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల చైర్మన్ చేరికపై అసంతృప్తి రగులుతున్న నేపథ్యంలో పావులు కదుపుకున్న తాజీ మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర సీనియర్ నాయకునికి పర్యవేక్షణలో జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికి చేరికలతో గ్రేటర్ వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్రం మారే అవకాశాలు న్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఎవరికి ఎసరు

మేయర్ అభ్యర్థిగా పోటీ చేసే లక్ష్యంగా తిరుపతిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికి జన చైతన్య సభ  గ్రేటర్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అశావాహులకు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ మేయర్ స్థానం జనరల్ రిజర్వేషన్ అయినప్పటికి నియోజకవర్గాల పునర్విభజన, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్లు పెరిగితే రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రిజర్వేషన్ మారితే గ్రేటర్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒక దానిపై తాజా చేరుతున్న నాయకుడి కన్నుపడే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులను మార్చకపోవడమే తమ ఓటమికి కారణమని కేసీఆర్, కేటీఆర్లతో పాటు పార్టీ సీనియర్లు పలు సందర్భాల్లో అన్నారు. ఇప్పటికే తాజా మాజీల స్థానంలో కొత్తవారిని పెట్టాలని పార్టీ రాష్ట్ర నాయత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈనేపథ్యంలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పశ్చిమ స్థానంలో నిలబడే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నియోజవర్గాల పునర్వీభజన జరిగి అసెంబ్లీ స్థానం పెరిగితే మాత్రం తాజా ఇరువురితోపాటు కొత్త చేరిన వారికి పోటీ చేసే అవకాశం ఉంటుందని కొంత మంది పార్టీ సీనియర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మాజీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టినప్పటికి వెనుక ఏర్పాటు చేసి ఫ్లెక్సీలో తాజా మాజీ ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడం పార్టీలో చర్చి నీయాంశంగా మారింది. మేం ఆయన పక్షం కాదని చెప్పడానికే ఈఫ్లెక్సీ ఏర్పాటు చేశారని తెలిసింది.

సొంత గూటికి మాజీలు

మరోవైపు రా ష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొండా దంపతుల ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరిన పలువురు కార్పొరేటర్లు పదవీ కాలం ముగియడంతో మాజీలయ్యారు. వరంగల్ రాజకీయ పరిణామాలు, కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ టికెట్లు దక్కవని భావిస్తున్న ఆ మాజీ కార్పొరేటర్లు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మొద టి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారికే టికెట్లు ఇవ్వా లన్న డిమాండ్కు టీపీసీసీ నుంచి సానుకూలత రావడంతో, బీఆర్ఎస్ నుం చి వెళ్లిన వారంతా సొంతగూటికి చేరేం దుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హనుమకొండ కేడీసీ మైదానంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా ఆదివారం జరగనున్న జన చైతన్య సభ వేదికగా ఎవరెవరు గులాబీ కండువా కప్పుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ భారీ బహిరంగ సభ వరంగల్ బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా లేక ఆధిపత్య పోరును మరింత పెంచుతుందా అన్నది వేచి చూడాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *