ఓయూ అభివృద్ధికి తొలి అడుగు

– రూ.480 కోట్ల పనులకు టెండర్లు
– హాస్టళ్లు, డైనింగ్ హాళ్లకు రూ.270కోట్లు
– అకడమిక్, రీసెర్చ్‌ భవనాలకు రూ.210 కోట్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి విడతలో రూ.480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్ నోటిఫికేషన్లు విడుద లయ్యాయి. తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ శనివారం ఈ మేరకు పత్రికల్లో టెండర్లను ప్రకటించింది. ఓయూ ప్రాంగణంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఆధునిక హాస్టళ్ల నిర్మాణంతో పాటు వంటశాలలు, భోజనశాలల ఏర్పాటుకు రూ.270 కోట్ల విలువైన పనుల కు టెండర్లు ఆహ్వానించారు. అదేవిధంగా అకడమిక్ భవనాలు, నూతన విభాగాల భవనాలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల నిర్మాణానికి మరో రూ.210 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మొత్తంగా రూ.480 కోట్లతో విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.

మిగిలిన పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం: వీసీ ఆచార్య కుమార్ 

గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ. వెయ్యి కోట్లతో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఓయూ క్యాంపస్కు వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా తాజాగా టెండర్లు విడుద ల కావడంతో విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మిగిలిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సైతం త్వరలోనే విడుదల చేసి పనులు ప్రారంభిస్తామని ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కార దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొంటూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓయూ తరపున కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *