ఎల్లమ్మ ఆలయంలో రామచందర్ రావు ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *