నవంబర్ 1న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ http://bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఉపయోగించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యాలయం సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *