లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం కీలక ప్రకటన చేశారు.
అక్టోబర్ 12, సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు, యువజన సంఘాలు, పౌరసమాజ సంస్థలు, ప్రజాస్వామ్యాన్ని సమర్థించే పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కల్పించడం తమ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం సమర్పించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.శనివారం యువతపై పోలీసులు, బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
సోమవారం ప్రదర్శనలో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, ఇతర ప్రతిపక్ష అగ్రనేతలు పాల్గొనే అవకాశం ఉంది.




