పొలాల్లో కన్నీటి ధార‌

– పంట‌ల‌పై ఎల్‌నినో పంజా
– సాగునీటి కొరతతో ఎండిపోతున్న వ‌రి
– ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతన్న‌లు

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక, చెమటోడ్చి సాగుచేసిన వరి పొలాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేక, కరెంట్ కోతలతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో.. చివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలాలకు పారిస్తున్నారు. ఎల్‌నినో వల్ల భవిష్యత్తులో విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటిస్తూ వ‌స్తోంది. వరి పంటలను సాగు చేయద్దని, నీటి వినియోగం తక్కువగా ఉంటే ఆరుతడి పంటలే వేయాలని జిల్లా అధికార‌ యంత్రాంగం ప్రకటిస్తోందే తప్ప క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కార్య‌క్రమాలు చేప‌ట్ట‌డం లేద‌నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో రైతు శ్యాంసుంద‌ర్ రెడ్డి త‌న‌ ఎనిమిది ఎకరాల వరి పంటకు 4 ట్యాంకర్ల ద్వారా నీటిని పారించాడు. ఈ దృశ్యాలు చూసిన మిగ‌తా రైతులు భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న చెందుతున్నారు.
ముందుముందు తాగు, సాగునీటికి మరింత ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు భరోసా కల్పించాలని, ప్రత్యామ్నాయ సాగుపై సమగ్రమైన ప్రణాళికను అమలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *