శ్రీరామనవమి నాటికి పుష్కర పనులు పూర్తి చేయాలి

– రూ. 348.59 కోట్ల నిధులతో ఆలయాభివృద్ధి, నూతన ఘాట్ల నిర్మాణం
– క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సమీక్ష

భద్రాచలం, ప్రజాంత్ర, నవంబర్ 11: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలంలోని గోదావరి తీర ప్రాంతాల్లో చేపడుతున్న ఘాట్ల అభివృద్ధి పనులు, ఆలయ పరిసరాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు, నూతన గోదావరి పుష్కర ఘాట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠాతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్‌లో అధికారులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్లు, కాంట్రాక్టర్లు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉందని, గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, సురక్షితమైన స్థానాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, డ్రైనేజీ, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా, అగ్నిమాపక ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పుష్కర వనం కోసం అనువైన స్థలం సేకరించాలని, విఐపిలకు, సాధారణ భక్తులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తుల కోసం డైరెక్టరీలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం దేవస్థానం అభివృద్ధి పనులతో పాటు పుష్కర ఘాట్ పనులకు కలిపి రూ. 348 కోట్ల 59 లక్షల నిధులు విడుదల చేసినందున అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. అవసరమైనచోట శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకుని, ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు భద్రాచలాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసే లక్ష్యంతో అధికారులు సమష్టి బాధ్యతతో పనిచేసి, అభివృద్ధి పనులన్నింటినీ శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బీ ఈఈ నాగేశ్వరరావు, డిప్యూటీ అనూష, ట్రాన్స్‌కో ఎస్పీ మహೇందర్, డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్, డిఏవో భగవన్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *