కార్తీకోత్సవం- 2026 పోస్టర్ ఆవిష్కరణ

– యాదగిరిగుట్ట ఆలయంలో మూడు రోజుల భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 10 : కార్తీకమాసం పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి మన సంస్కృతి-వారసత్వాన్ని, సంప్రదాయ కళలను పరిరక్షించి ప్రోత్సహించాలనే సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థానం(వైటీడీి) మొదటిసారిగా కార్తికోత్సవం-2026 పేర మూడు రోజుల సాంస్కృతిక ఆధ్యాత్మిక మహోత్సవాన్ని నిర్వహించడానికి సన్నద్ధóŠమైంది. ఈ ఉత్సవాలలో ప్రఖ్యాత ధార్మిక పండితులు, ఆధ్యాత్మిక వక్తల ఆధ్యాత్మిక ప్రవచనాలు, మనోహరమైన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, ప్రముఖ సంగీత విద్వాంసులు భక్తి సంగీత కచేరీలు, ప్రసిద్ధ కళాకారులు ప్రదర్శించే వివిధ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్నాన్ని, భక్తిని పెంపొందించే దివ్య లక్ష్యంతో, మన సంస్కృతి శాశ్వత వైభవాన్ని, భారతదేశ శాస్త్రీయ కళారూపాల వైభవాన్ని, తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శినలకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తాంది.

కార్యక్రమాల వివరములు

20వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మచే ఆధ్యాత్మిక ప్రవచనం. రాత్రి 7.30గంటల నుండి తేలు విజయచే జానపద భక్తి సంగీత కార్యక్రమం. 21న సాయంత్రం 6 గంటల నుంచి ఆర్.పి.పట్నాయక్, నిహాల్, నిత్యసంతోషిని, గోపిక పూర్ణిమ, శ్రీనిధి, స్వప్న(జర్నలిస్టు), వాద్య బృందం సహకారంతో పరంపర సంస్థ దర్శకత్వంలో నృత్య కార్యక్రమాలు. 22న సాయంత్రం 6 గంటల నుండి రుద్రాక్ష ఫౌండేషన్‌చే ఒడిస్సి నృత్య ప్రదర్శన. అభినేత్రి బృందంచే తెలంగాణ దేవాలయాల ఇతివృత్తంపై నృత్య ప్రదర్శన. రాత్రి 7 గంటల నుండి కళాకృష్ణ బృందం పేరిణి/రుద్రాక్ష ఫౌండేషన్ చే ఒడిస్సీ అభినేత్రం. రాత్రి 8 గంటల నుండి ఎ సెంబుల్ టెంపుల్స్ ఆఫ్ తెలంగాణచే నృత్య ప్రదర్శన.

శ్రీ లక్ష్మీనరసింహ నామార్చన సహిత కోటి పుష్పార్చన

కార్తీక ఉత్సవం-2026లో భాగంగా మొదటి రోజు(20న)న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆర్చక బృందంచే శ్రీ లక్ష్మీనరసింహ నామార్చన సహిత కోటి పుష్పార్చన నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *