వేగంగా పెరుగుతున్న సైబర్ మోసాలు

– నకిలీ ప్రకటనలతో ఆన్లైన్ మోసాలు
– ఆన్లైన్ షాపింగ్ లో మోసాలు
– జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన టీజీసీఎస్బీ
– ఈమేరకు అడ్వయిజరీ జారీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: సైబర్ జాగరూకతా దివస్ సందర్భంగా ప్రారంభించిన సైబర్ అవగాహన ప్రచారంలో భాగంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గత 20 నుండి 30రోజులుగా వేగంగా పెరుగుతున్న రెండు సైబర్ నేర పద్ధతుల  గురించి పౌరులనుహెచ్చరిస్తూ అత్యవసర పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలి సైబర్ నేరాలధోరణుల విశ్లేషణ ప్రకారం, ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్‌లు, పండుగ డిస్కౌంట్లు,హానికరమైన మొబైల్ అప్లికేషన్లను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు అమాయక పౌరులనుమోసం చేస్తుండటంతో, ప్రకటన మోసం (వస్తువులు/సేవలు అందకపోవడం), గుర్తింపుదొంగతనం (అనధికార క్రెడిట్/డెబిట్ కార్డ్ దుర్వినియోగం)కు సంబంధించినఫిర్యాదులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టీజీసీఎస్బీ ఈ అడ్వయిజరీని జారీచేసింది.

ప్రకటనల ద్వారా మోసం

వస్తువులు మరియు సేవలు అందకపోవడం. ఈ ట్రెండింగ్ మోసంలో, మోసగాళ్లు సోషల్ మీడియా వేదికలు (ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్), మెసేజింగ్ యాప్‌లు (వాట్సాప్), నకిలీ వెబ్‌సైట్లలో మోసపూరితప్రకటనలను ప్రచారం చేస్తారు. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, హాలిడేప్యాకేజీలు, బ్యూటీ/గృహ సేవలు, ఆన్‌లైన్ కోర్సులను నమ్మశక్యం కాని తక్కువ ధరలకు, మెగా సేల్ – ఫ్లాట్ 70% డిస్కౌంట్, వంటివి అందిస్తామని చెబుతారు. బాధితులు యూపీఐ,డిజిటల్ వాలెట్లు లేదా బ్యాంక్ బదిలీల ద్వారా ముందస్తు చెల్లింపు చేసిన తర్వాత,మోసగాళ్లు నకిలీ ఆర్డర్ ధృవీకరణలు పంపి, డెలివరీ ఆలస్యం అంటూ తప్పుడు కారణాలుచెబుతారు. ఆ తర్వాత బాధితుల నంబర్‌ను బ్లాక్ చేసి, వెబ్‌పేజీని మూసివేస్తారు;ఎలాంటి వస్తువులు లేదా సేవలు అందించరు.అందువల్ల  తెలియని లేదా ధ్రువీకరించని సోషల్ మీడియా విక్రేతల నుండి కొనుగోలు చేయకండి. భారీ, అసంభవమైన డిస్కౌంట్లు ఇచ్చే ఆఫర్లను నమ్మకండి. చెల్లింపు చేసే ముందు విక్రేత వివరాలు, కస్టమర్ రివ్యూలు, అధికారికవెబ్‌సైట్లను సరిచూసుకోండి. ధ్రువీకరించని  ఖాతాలకు ఎప్పుడూ ముందస్తు చెల్లింపులు చేయకండి.

గుర్తింపు దొంగతనం

సైబర్ నేరగాళ్లు కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని, అధికారిక బ్యాంక్ రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ క్లెయిమ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపుపథకాలుగా, (కార్డ్ పరిమితిని రూ.5,00,000 వరకు పెంచుకోండి వంటివి) కనిపించే ఫిషింగ్ లింక్లు మరియు హానికరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీలు (ఏపీకే ఫైల్స్)ద్వారా మోసం చేస్తున్నారు. బాధితులు ఈ లింక్‌లపై క్లిక్ చేసినప్పుడు లేదాహానికరమైన ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, కార్డ్ నంబర్లు, గడువు తేదీలు, సీవీవీ కోడ్‌లు, పిన్లు, ఓటీపీల వంటి సున్నితమైన వివరాలను నమోదు చేసేలా మోసపోతారు; లేదామాల్వేర్ రహస్యంగా ఎస్ఎంఎస్ లను అలర్ట్‌లను అడ్డగిస్తుంది. మోసగాళ్లు ఇలా సేకరించినవివరాలను వెంటనే దుర్వినియోగం చేసి, కార్డుదారుని అనుమతి లేకుండా ఆన్‌లైన్కొనుగోళ్లు మరియు దేశీయ లేదా అంతర్జాతీయ లావాదేవీలు చేస్తారు.

ముఖ్యమైన జాగ్రత్తలు 

వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా తెలియని లింక్‌ల ద్వారా వచ్చిన ఏపీకే ఫైళ్లను ఎప్పుడూడౌన్‌లోడ్ చేయకూడదు. ఇన్‌స్టాల్ చేయకూడదు. కార్డ్ నంబర్, సీవీవీ, ఓటీపీ లేదా పిన్ వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. కార్డ్ అప్‌గ్రేడ్ లేదా రివార్డ్ ఆఫర్లను అధికారిక బ్యాంక్ యాప్ లేదాకస్టమర్ కేర్ ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవాలి . ఏదైనా అనధికార అలర్ట్ వస్తే, వెంటనే మీ కార్డును బ్లాక్ చేసి బ్యాంకుకుతెలియజేయండి.ప్రజా సలహా  గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ ప్రగతి, ఆన్‌లైన్ వ్యాపారిని, చెల్లింపు లింక్‌ను, బ్యాంకింగ్ అభ్యర్థననుకొనసాగించే ముందు ఒకసారి ఆగి, ధ్రువీకరించుకోవాలని టీజీసీఎస్బీ పౌరులందరినీ కోరుతోంది. మీరుఏదైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే, కీలకమైన గోల్డెన్ అవర్ లోనే వెంటనేజాతీయ సైబర్ క్రైమ్ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి, లేదాwww.cybercrime.gov.in లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని టీజీసీఎస్పీ డైరెక్టర్ శిఖా గోయల్ కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *