– కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ కార్యదర్శితో సీఎస్ సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్రంలో డిసెంబర్ 11 నుండి 22వ తేదీ వరకు నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహణకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజాయ్ జాజు తెలిపారు. ఈ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ ఈ ఖేలో ఇండియా క్రీడలకు దాదాపు ఏడు వేల మంది క్రీడాకారులు హాజరవుతున్నందున వారికి, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన క్రీడా వేదికల తయారు, శానిటేషన్, తాగునీరు, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు. ఇందుకుగాను రూ.120 కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించామని చెప్పారు. ప్రతీ వేదికకు ఒక్కొక్క అడిషనల్ కలెక్టర్స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించామన్నారు. క్రీడా పోటీ జరిగే ప్రతీ వేదిక వద్ద ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌తోపాటు హన్మకొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఖేలో ఇండియా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ గేమ్స్ నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని స్టేడియాలను సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే 11 స్టేడియాలు సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదు స్టేడియాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ క్రీడా, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, స్పోర్ట్ అథారిటీ ఎండీ సోని బాలదేవి, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





