– అలుపెరుగని సేవలు.. అయినా వృత్తి భద్రత కరువు
– రాష్ట్రవ్యాప్తంగా 78 విభాగాలకు చెందిన 17,541 మంది ఉద్యోగులు
– కొనసాగుతున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసనలు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి. సిరిసిల్ల, నవంబర్ 10: మానవీయ దృక్పథంతో వైద్య సేవలు అందించడంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధి లోని కాంట్రాక్టు ఉద్యోగులు అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వృత్తి భద్రత కరువై అభద్రతాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అక్టోబర్ 13 నుంచి నిరవధికంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతున్నారు. ఈనెల 10 నాటికి ఈ ఆందోళనలు 29 రోజులకు చేరుకున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
78 విభాగాలు.. 17,541 మంది ఉద్యోగులు
నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని 78 విభాగాల్లో సుమారు 17,541 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తెలుపుతున్నారు. కాంట్రాక్టు పద్ద తిలో సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా పనిచే స్తున్న తమకు కనీసం వృత్తి భద్రత కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రా క్టు పద్ధతికి స్వస్తి పలికి ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. గతంలో అనేకమార్లు సమ్మెలు జరిగినప్పటికీ అప్పటికప్పుడు బుజ్జగించే యత్నాలు చేయడం తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు సహా అన్ని విభాగాలకు చెందిన సుమారు 280 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ‘ప్రజాతంత్ర’కు తెలిపారు. కాగా, ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి సమ్మెకు ముగింపు పలకాలని కోరుతున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు ఇవీ..
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ప్రధా నంగా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఎన్హెచ్ఎం సిబ్బందిని రెగ్యు లరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఎటువంటి ఆర్ధిక భారం ఉండదు. కాబట్టి తక్షణమే క్రమబద్ధీకరించాలి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఎన్హెచ్ఎం ఉద్యోగికి క్యాడర్ ఫిక్సేషన్ చేసి, 100 శాతం గ్రాస్ సాలరీ ) అమ లు చేయాలి. ముందస్తు సమాచారం. లేదా సమ్మతి లేకుండా 3 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు బదిలీ చేసేందుకు ఉద్దే శించిన జీవో నంబర్ 1195ను తక్షణ మే పునఃపరిశీలించాలి. అవుట్సోర్సిం గ్ ఏజెన్సీలను పూర్తిగా రద్దు చేసి ఎన్ హెచ్ఎం ఉద్యోగులందరినీ ‘స్టేట్ హెల్త్ సొసైటీ’ పరిధిలోనే కొనసాగిస్తూ స్పర్స్ విధానం ద్వారా వేతనాలు చెల్లించాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





