ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌ప్ర‌జాతంత్ర‌,జ‌న‌వ‌రి 29 :  రాష్ట్ర అభివృద్ధిప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాల‌ని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూహౌసింగ్సమాచారపౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధిసంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డియస్. జగన్డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *