బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలన్నారు. ఆ దిశగా ఫామ్ హౌస్‌కు చేరుకుంటున్న బీఆర్ఎస్ మాజీ తాజా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు.

ముఖ్య నేతలకు కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో… ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి,సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్,గణేష్ బిగాల గుప్త, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అశన్న గారిజీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్, ఆయేషా షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *