అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు!

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.  దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 80వేల ఎగువకు చేరింది. నిప్టీ 24,200 పాయింట్ల ఎగువన స్థిరపడిరది.  సెన్సెక్స్‌ ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,117.11) లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కదలాడిరది. ఇంట్రాడేలో 1300 పాయింట్లకు పైగా లాభపడి 80,473.08 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద ముగిసింది. నిప్టీ సైతం 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడిరది. డాలరుతో రూపాయి మారకం విలువ కాస్త బలపడి 84.30కి చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2672 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి జొమాటోను తీసుకొంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఆ కంపెనీ షేరు రాణించింది. ఇంట్రాడేలో 7 శాతం మేర లాభపడిన ఆ షేరు.. చివరికి 3.29 శాతం లాభంతో రూ.272.90 వద్ద స్థిరపడిరది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 2.40 శాతం కుంగి 953.35 వద్ద ముగిసింది. అయితే.. నిన్న గాక మొన్న అంతర్జాతీయ ప్రభావం.. అదానీపై కేసు వ్యవహారం ఫలితంగా  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నేలచూపులు చూశాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ గత ట్రేడిరగ్‌  సెషన్‌లో లాభాలు చవిచూసిన సూచీలు.. మరోసారి తన నష్టాల పరంపరను కొనసాగించాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అదానీ గ్రూప్‌ ఛ్కెర్మన్‌పై అమెరికాలో అభియోగాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో బీఎస్‌ఈ దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి నష్టాలను మూటగట్టుకుంది. సెన్సెక్స్‌ ఉదయం 77,711.11 పాయింట్ల (క్రితం ముగింపు 77,578.38) వద్ద లాభాల్లో ప్రారంభమయ్యాయి. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 76,802.73 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 422 పాయింట్ల నష్టంతో 77,155.79 వద్ద ముగిసింది. నిప్టీ సైతం 168.60 పాయింట్ల నష్టంతో 23,349.90 వద్ద స్థిరపడిరది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 7 పైసలు క్షీణించి జీవనకాల కనిష్ఠమైన 84.49కు చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్టాట్రెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73 డాలర్లకు చేరగా.. బంగారం ఔన్సు 2671 వద్ద ట్రేడవుతోంది.  సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూపు భారత్‌లో లంచాలు ఇవ్వజూపిందన్న ఆరోపణలపై గౌతమ్‌ అదానీ సహా పలువురిపై అమెరికాలో కేసు నమోద్కెంది. దీని ప్రభావంతో అదానీ గ్రూపు స్టాక్స్‌ అన్నీ నష్టపోయాయి. దీని ప్రభావం సూచీలపై పడిరది.   రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుండడం కూడా మదుపర్ల భయాలకు కారణమైంది. దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో పుతిన్‌ తమ అణువిధానాలను సవరించడం యుద్ధ భయాలను పెంచింది. మరోవైపు దేశీయ మార్కెట్‌లో విదేశీ మదుపర్ల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ వరుస నష్టాలకు కారణంగా నిలుస్తున్నాయి.

– రేగటి నాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page