పాలమూరు ఎత్తిపోతలపై వేడెక్కిన రాజకీయం

– శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నా ఎండుతున్న ఆయకట్టు
– కాల్వలు, భూసేకరణ పనుల్లో జాప్యంపై నిరసనలు
– అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

మహబూబ్‌గర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దశా బ్దాల కల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ఎగువన కృష్ణా నదిలో వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరుతుంటే మరో వైపు తుది దశ కాల్వల నిర్మాణం, భూసేకరణ పనులు ముందుకు సాగకపోవడంతో సాగునీరు అందక రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇటీవల జిల్లాలోని పలు రైతు సంఘాలు, ప్రతిపక్ష నాయకులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసనలకు పిలుపునివ్వడంతో జిల్లావ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పంపుల నిర్వహణపై మొదలైన వివాదం

ప్రాజెక్టు మొదటి దశ పరిధిలోని నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లకు పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోయడం లేదని, నార్లాపూర్ పంప్ హౌస్‌లో మోటార్ల నడిపించండంపైౖ స్పష్టత కొరవడిందని బీఆరఎస్ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 90 శాతం పనులు గతంలోనే పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం పంపులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శిస్తుంటే గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, భూసేకరణ పూర్తి చేయకుండా కేవలం ప్రచారం కోసమే తొందరపడిందని, తాము నిధులు కేటాయించి పనులను సమగ్రంగా పూర్తి చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.

తుది దశ కాల్వలు ఏవి?

నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల లింక్ పనులు, వాటి కింద ప్రధాన కాల్వల తవ్వకం నిలిచిపోవడంతో పొలాలకు నీరు చేరడం లేదు. జిల్లాలో వరి, పత్తి పంటలకు వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు అందక పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని, వెంటనే పీఆరఎలఐ పంపులను నిరంతరాయంగా నడిపి చెరువులు, రిజర్వాయర్లను నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *