* పాత బస్తీకి చెందిన ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్
హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 9: నగరంలోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పార్టీపై పోలీసులు దాడులు చేశారు. క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఇంటిలో గంజాయి పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి… ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 220 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ దాడుల్లో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అతౌల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

