కన్న తండ్రే కాలయముడయ్యాడు

– బోరబండ పీఎస్ పరిధిలో దారుణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో అయిదేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండ పరిధిలోని శిల్పి నగర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. విద్యాసాగర్, దుర్గ అనే దంపతులకు అయిదేళ్ల కుమారుడు విజjáYT ఉన్నాడు. దుర్గ కేటరింగ్ పనికి వెళ్తుండగా విద్యాసాగర్ మద్యానికి బానిసగా మారినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి దుర్గ కేటరింగ్ పనికి వెళ్లగా పది గంటల సమయంలో తాగిన మైకంలో ఉన్న విద్యాసాగర్ తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ను గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. తెల్లవారుజామున పని ముగించుకుని ఇంటికి వచ్చిన దుర్గకు కుమారుడు విగత జీవిగా కనిపించాడు. ఉలుకు పలుకు లేని కూమారుడిని చూసి ఆ తల్లి షాక్‌కు గురైంది. ఆ కన్నతల్లి పడుతున్న వేదనను చూసిన చుట్టుపక్కల వారు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం స్థానికుల ద్వారా వెలుగులోకి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *