– బంగారం తాకట్టు కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: న్యాయాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడ్డాడు. వరకట్న హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన విలువైన ఆస్తులు, నగదును స్వార్ధం కోసం వాడుకున్నాడు. ఈ ఆ రోపణలపై అతనిపై కేసు నమోదైంది. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మ అనే మహిళ తన కుమార్తె హేమ మృతిపై ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడంతోనే తన కుమార్తె ఉరేసుకుని మృతి చెందిందని జులై 30న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు ఆధారాల సేకరణలో భాగంగా పంచనామా నిర్వహించి నిందితుల నుం చి మొబైల్ ఫోన్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీజ్ చేసిన కేస్ ప్రాపర్టీని ఆగస్టు 22న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమక్షంలో… స్టేషన్ హౌస్ ఆఫీసర్, సెక్టార్ ఎస్ఐ ఉమామహేశ్వరి సమక్షంలో సరైన రశీదుతో కానిస్టేబుల్ ఎన్. శ్రావణ్ కు మార్కు భద్రపరచడం కోసం అప్పగించారు. కేసు ప్రాపర్టీకి బాధ్యత వహించాల్సిన కానిస్టే బుల్ శ్రావణ్ కుమార్ తన చేతిలో ఉన్న ఆస్తులను దుర్వినియోగం చేసినట్లు తదుపరి విచారణలో బయటపడింది. ఏ1 నిందితుడి సీజ్ చేసిన మొబైల్ ఫోన్ ద్వారా యూపీఐ సహాయంతో రూ.1,70,000 నగదును బదిలీ చేసుకున్నాడు. ఇందులో రూ.1.37,000 నగదును తన భార్య ఖాతాకు, మిగిలిన మొత్తాన్ని మల్లకేడి శివాజీ అనే వ్యక్తి ఖాతాకు మళ్లించాడు. ఇంతటితో ఆగకుండా కేసులో ఏ2 నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 122.2 గ్రాముల బంగారు ఆభరణాలను బయట తాకట్టు పెట్టి రూ.12.37,000 సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. కేసులో నిందితుడిగా ఉన్న ఏ5 మొబైల్ ఫోన్ ను నిందితుడికే తిరిగి ఇచ్చేసినట్లు తేలింది. కానిస్టేబుల్ చేసిన ఈ అక్రమాలపై మీర్పేట్ ఇన్స్పెక్టర్ బి.శోభన్ ఈనెల 27న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





