కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి తిమింగలం

– ఏసీబీ వలకు చిక్కిన ఎస్సై శ్రీనివాస్
– గతంలోనూ ఇదే స్టేషన్‌లో పట్టుబడిన అధికారులు

మేడ్చల్/కీసర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాగారం పరిధిలోని శిల్పానగర్‌లో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం నిఘా ఏర్పాటు చేసిన అధికారులు దాడి జరిపినట్లు తెలిసింది. ఈ క్రమంలో రూ.2 లక్షల నగదును స్వీకరిస్తున్న ఎస్సై శ్రీనివాస్‌ను పట్టుకున్నారు.

ఒకే స్టేషన్‌లో వరుస అవినీతి ఆరోపణలు

కీసర పోలీస్ స్టేషన్‌లో గతంలోనూ సీఐ, ఎస్సై స్థాయి అధికారులు లంచం వ్యవహారాల్లో ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరో ఎస్సై పట్టుబడటంతో ఈ పోలీస్ స్టేషన్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో పోలీస్ శాఖలో అధికారుల పర్యవేక్షణ, విధి నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించి, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే ఇలాంటి ఆరోపణలు పునరావృతం కావడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి సారించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.


zతెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *