కన్యాశుల్కం తరహాలో వివాహం

– ప్రియుడితో పరారైన యువతి

జనగామ, ప్రజాతంత్ర, మే 18: జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. ఇటీవల వార్డు మెంబర్ ఎన్నికై న బచ్చన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నేత ప్ర శాంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన దంప తులకు రూ.20 లక్షల అప్పు ఇచ్చాడు. అయితే అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో వారి కూతురి నిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. అవస రమైతే ఎదురుకట్నం ఇస్తానని ఆశ చూపి కొంత డబ్బు ముట్టజెప్పాడు. దీంతో సవతి తల్లి- తండ్రి కలిసి తమ 18 ఏళ్ల కుమార్తెను బలవంతంగా ఒప్పించి ప్రశాంత్ రెడ్డితో వివాహం జరిపించారు. అప్పటికే ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో పెళ్లి అయిన మరుసటి రోజే ప్రియుడితో యువతి పరా రైంది. స్నేహితుల సహాయంతో ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకున్న యువతి హైదరాబా ద్లో మహిళా కమిషనన్ను ఆశ్రయించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *