స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలి

– 26 వరకు ‘బోనాలు- చేతివృత్తుల మేళా’
– ట్యాంక్‌ ‌బండ్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహం వద్ద ప్రదర్శనలు
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం 

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: చేతి వృత్తి కళాకారులకు చేయూతనివ్వాలని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బోనాలు- చేతివృత్తుల మేలా, బీసీ చేతివృత్తుల అమ్మకాలు- ప్రదర్శన‘ను ఈనెల 16నుండి 26 తేదీ వరకు ట్యాంక్‌ ‌బండ్‌, అం‌బేద్కర్‌ ‌విగ్రహం ప్రక్కన గల గ్రౌండ్స్ ‌లో నిర్వహిస్తోంది. చేతివృత్తుల కళాకారులచే తయారు చేసిన వివిధ వస్తువుల ప్రదర్శన, విక్రయం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ప్రదర్శనలో కుమ్మరులు తయారు చేసిన మట్టిపాత్రలు, గౌడన్నల ‘నీరా’ స్టాల్‌, ‌మేదరివారు తయారు చేసిన వెదురు వస్తువులు,హ్యాండ్‌ ‌లూమ్స్ ‌పోచంపల్లి-ఇక్కత్‌, ‌గద్వాల్‌ – ‌నారాయణపేట్‌, ‌పూసలవారి సామగ్రి, మహిళా స్వయం సహాయక సంఘాల స్వగృహ ఫుడ్స్, ఇతర బీసీ వర్గాలు తయారు చేసిన వస్తువులు, తెలంగాణ వంటకాలు, మత్స్య కారుల చేప వంటకాలు, ఇతర భోజన స్టాల్స్ ‌సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్క‌డ‌ లభించే వస్తువులు వినియోగదారులకు, సందర్శకులకు సరసమైన ధరలలో లభ్యమవుతున్నాయి. ఈ ప్రదర్శన రోజూ ఉదయం 10  నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నది. సందర్శకులకు ప్రవేశము ఉచితం. ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణతో స్టాల్స్ ‌నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత, హస్తకళలు, మట్టి కళలు, చెక్క బొమ్మలు వంటి సంప్రదాయ కళలను ప్రోత్సహించడమే ఈ మేళా ప్రధాన లక్ష్యమని, గ్రామీణ కళాకారుల ప్రతిభకు మార్కెట్‌ ‌కల్పిస్తూ వారి జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఇటువంటి మేళాలు కీలక పాత్ర పోషిస్తాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌భావనకు అనుగుణంగా స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని, సంప్రదాయ కళలను నేటి తరానికి పరిచయం చేసి భావితరాలకు అందించడం మన అందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం కళాకారుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్‌ అవకాశాల విస్తరణకు కట్టుబడి ఉందన్నారు. మేళాలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి అభినందనలు తెలియజేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బోనాల పండుగకు అవసరమైన బోనం కుండలతోపాటు సంప్రదాయ ఆచారాలకు ఉపయోగించే వివిధ రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. తెది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *