బీజేపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవు

– అందరం కలసి అధికారం కోసం కృషి చేస్తున్నాం
– బండి సంజయ్‌, ఈటల మధ్య సయోధ్యకు యత్నం
– ఎంపీ లక్ష్మణ్‌ ‌నివాసంలో ఇద్దరు నేతలతో అభయ్‌ ‌పాటిల్‌ ‌చర్చలు
– రాష్ట్రంలో అధికారం బీజేపీదేనన్న లక్ష్మణ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 18: తెలంగాణ బీజేపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలసి అధికారం కోసం కృషి చేస్తున్నామని ఎంపి లక్ష్మణ్‌ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఎం‌పీ ఈటల రాజేందర్‌ ‌మధ్య ఉన్న విభేదాలపై స్పందించారు. కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. వారిద్ద‌రితో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్‌ ‌పాటిల్‌ ‌ఎంపీ లక్ష్మణ్‌ ‌నివాసంలో గంటపాటు సమావేశం అయ్యారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని అభయ్‌ ‌వారికి సూచించారు. కరీంనగర్‌ ‌నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో ఇద్దరూ కలిసి పనిచేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆ ఇద్ద‌రితో కలిసి ఎంపీ లక్ష్మణ్ ‌మీడియాతో మాట్లాడారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడంపై చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్‌పై కోపం ఉందని, అలాగే బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయని, జమిలి ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు.  ఈ క్రమంలోనే నేతల మధ్య విభేదాలను తొలగించి.. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని ప్లాన్‌ ‌చేస్తోంది. ఎంతో కాలంగా విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న బండి సంజయ్‌, ఈటల మధ్య సయోధ్య కుదిర్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *