విద్యారంగ సంస్కరణలు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాయి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఎస్టీఎఫ్ రాష్ట్ర విద్యా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాభవన్, నవంబర్ 7: రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం(ఎస్టీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్లోని ఖైరతా బాద్ ఇంజనీర్స్ భవన్లో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా మహాసభ పోస్టర్ను ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు తెలంగాణను విద్యా రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు దోహదపడతా యని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచ డంతోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.పోచయ్య మాట్లాడుతూ ఈ నెల 15న ఖైరతాబాద్లోని ఇంజనీర్స్ భవన్లో నిర్వహించే రాష్ట్ర విద్యా మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యా మహాసభలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఉపాధ్యాయులకు న్యాయం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఎస్టీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పి.రామమూర్తి ఎస్ కె.మన్సూర్ అలీ, లచ్చిరాం, బండి నరసింహులు, కుర్ర యాదగిరి, మద్దెల రాజేశం తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *