పాత బస్తీలో ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై దాడులు

– వాడిన నూనె, రంగులు కలిపిన చికెన్‌ ‌స్వాధీనం
– అపరిశుభ్ర వాతావరణంలో సెంటర్ల నిర్వహణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 18 : చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, ‌ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అల్‌-‌మదీనా చైనీస్‌ ‌ఫాస్ట్ ‌ఫుడ్‌ ‌సెంటర్‌, ఒమెర్‌ ‌చైనీస్‌ ‌ఫాస్ట్ ‌ఫుడ్‌ ‌సెంటర్‌లో తనిఖీలు చేయగా అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో రెండు కేసులు నమోదు చేసిన అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాడిన వంట నూనెను తిరిగి వినియోగిస్తున్నారని, కృత్రిమ ఫుడ్‌ ‌కలర్స్ ‌వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పెస్ట్ ‌కంట్రోల్‌ ‌రికార్డులు, వాటర్‌ అనాలిసిస్‌ ‌సర్టిఫికెట్లు లేనట్లు తనిఖీల్లో బయటపడింది. సుమారు 20 లీటర్ల వాడిన‌ నూనె, 10 ‌లీటర్ల ఫ్రెష్‌ ‌కుకింగ్‌ ఆయిల్‌ను సీజ్‌ ‌చేశారు. సుమారు 40 కిలోల ఫ్రైడ్‌ ‌చికెన్‌తోపాటు 40 కిలోల రంగు కలిపిన రా చికెన్‌ను అధికారులు సీజ్‌ ‌చేశారు. 3 బాక్సులు, 6 ప్యాకెట్ల ఆర్టిఫిషియల్‌, ‌సింథటిక్‌ ‌ఫుడ్‌ ‌కలర్స్‌ను హెచ్‌ఫాస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, సీజ్‌ ‌చేసిన సామగ్రిని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *