– రూ. కోట్లలో జీఎస్టి ఎగవేత
– అధికారుల ఉదాసీనత.. ప్రభుత్వ రాబడికి గండి
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 7: దీపా వళి పండుగ వేళ ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాల మాటన అక్రమాలు వెలుగుచూ స్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేష న్‌తో పాటు ఎదులాపురం, మధిర, కల్లూ రు, వైరా, సత్తుపల్లి పట్టణాల్లో ప్రత్యేకంగా వందలాది బాణసంచా దుకాణాలు ఏర్పా టు చేస్తుంటారు. ఖమ్మం నగరంలో ఎ స్ఆర్ అండ్ బిజిఎస్ఆర్, పెవిలియన్ మైదానంలో 128 దుకాణాలు వెలిశాయి. కొందరు సిండికేట్ గా ఏర్పడి దందా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నిబంధనలు అమలు చేయడం లేదు. తమిళనాడులోని శివకాశి, ఏపీలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున బాణసంచా కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రూ. కోట్ల మేర జీఎస్టీ పన్ను ఎగ -వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీపావళి సామగ్రి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి వస్తుంది. దీనిపై రూ.లక్షకు 18 శాతం పన్ను ఉంటుంది. వ్యాపారం చేస్తే రూ.18 వేలు ప్రభుత్వానికి చెల్లించా లి. జిల్లాలో వ్యాపారులు ముందస్తుగా తాము చేయబోయే వ్యాపారం గురించి జీఎస్టీ అధికారుల -దగ్గర తాత్కాలిక అనుమతి తీసుకుంటున్నారు. చాలా మంది పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నా.. చాలా తక్కువ మొత్తంలో చేస్తున్నట్లు చెప్పి ‘అడ్వాన్సు ట్యాక్స్’ రూపంలో ముందస్తు చెల్లింపులు తక్కువగా చెల్లిస్తున్నారు. విక్రయాలు పూర్తయిన తర్వాత లావాదేవీలను బట్టి పన్ను చెల్లిస్తామని చెబుతున్నారు. కానీ కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన బిల్లులు కొంతమంది దగ్గర ఉండడం లేదు. రిజిస్టర్లు. రికార్డులు సైతం నిర్వహించటం లేదు. కొనుగోలుదారులకు కూడా కేవలం తెల్ల కాగితాలపై రాసిస్తున్నారు. పెద్ద ఎత్తున విక్రయాలు సాగుతున్నా బిల్లుల నిర్వహణ లేకపోవడంతో వ్యాపారి ఎంత చెబితే అంతకే అధికారులు పన్ను వసూలు చేస్తున్నారు. జమా లెక్కలు లేకపోవటంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున జీఎస్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. చాలా మంది వ్యాపారులు లావాదేవీలు పూర్తయిన తర్వాత పన్నులకు సంబంధించిన వివరాలు చూపించకుండానే వెళ్తున్నారు. కొంతమంది నష్టం వచ్చిందనో, తక్కువ వ్యాపారం జరిగిందనో, సరకు మిగిలిపోయిందనో చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ అంశంపై స్టేట్ జీఎస్టీ అధికారులు మాట్లాడుతూ ముందస్తు పన్ను వసూలు చేసిన తర్వాతనే అనుమతులు ఇస్తున్నాం.. ఆ తర్వాత లావాదేవీల ఆధారంగా జీఎస్టీ వసూలు చేస్తామని పేర్కొంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





