– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి (మహేంద్ర హిల్స్)లోని మాతా అమృతానందమయి మఠ రజతోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి పాతికేళ్లుగా మఠం అందిస్తున్న ఆధ్యాత్మిక, నిస్వార్థ సమాజ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఇతర ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




