మన చేతుల్లోనే… మన ఆరోగ్యం!

 పోషకాహార లోపాలు  అధిగమించండిలా…

సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు. పిల్లలకు తల్లి పాలివ్వటం…   అనుబంధ అహారాన్నివ్వటం  ప్రాముఖ్యత, తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను  సరైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసము, ధాన్యాలను కలపాల్సిన అవసరము ఉంటుంది. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు ఆహరాన్ని ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. పిల్లలకు వ్యాధి నిరోధకశక్తిని పెంచడం, దైనందిన  జీవితములో సక్రమమైన పారిశుధ్యాన్ని పాటించే ప్రాముఖ్యత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వివిధ అహార పదార్ధాల ద్వారా క్యాలరీలు, మాంసకృత్తులు..  సూక్ష్మ పోషకాలైన ఐరన్‌, విటమిన్‌ ఎ,  జింకు మొదలైన  వంటి వాటిని తీసుకోవటం ద్వారాలోటు భర్తీ చేయవొచ్చు. తద్వారా గర్భిణీలు,  శిశువులు, చిన్నపిల్లలను పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవొచ్చు. కౌమర, యవ్వన స్త్రీలలో బరువు తక్కువ అని కనుగొన్నప్పుడు ఆహారము ఎక్కువగా తీసుకోవాలి. సూక్ష్మపోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ తీసుకునే కూరగాయలు, ఫలాల వాడకాన్ని పెంచాలి. పశు ఉత్పత్తులైన , చేపలు, గుడ్లు తీసుకోవాలి.

విటమిన్‌-ఎతో కూడిన పాలు, ఐరన్‌, విటమిన్లతో కూడిన పిండి మొదలైనవి  లభించెటట్టు తీసుకోవాలి. అయోడైజ్‌ ఉప్పును ఉపయోగించాలి. అవసరమైన సూక్ష్మపోషకాలు ఆహారపదార్ధాల ద్వారా లభించనట్లయితే వైద్యులసలహామేరకు కొన్ని మందులు ఉపయోగించి ఆ లోటును భర్తీ చెయ్యాలి. గర్భంతో ఉన్నప్పుడు పిండ అభివృద్ధి కోసం.. భవిష్యత్తులో చనుబాలిచ్చేందుకు చాలినంత బరువు పెరిగే విధంగా ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.
ఐరన్‌, ఫాలికామ్లపు బిళ్ళలను తరచూ మింగాలి. చనుబాలిస్తున్నప్పుడు ప్రతిరోజూ అదనంగా పోషకాలతో కూడిన సమతుల్య భోజనానికి సమానంగా తినాలి. విటమిన్‌- ఎ లోపము ఉన్న ప్రదేశాలలో పెచ్చుమోతాదు విటమిన్‌-ఎ బిళ్ళలను ప్రసవమయిన వెంటనే, ప్రసవమయిన ఎనిమిది వారాల లోపు తీసుకోవాలి. చనుబాలలోని విటమిన్‌ -ఎ సారం పెరుగుతుంది.  తల్లీపిల్లలను వ్యాధిగ్రస్తులు కాకుండా సహాయపడుతుంది. జబ్బుపడ్డప్పుడు పిల్లలకు చాలినంత పోషాకాహారం అందించాలి. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు వేడిగా వున్న ఆహరాన్ని ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం..  పిల్లల సంక్షేమ కోసం కొన్ని పథకాల ద్వారా ముఖ్యంగా  గర్భస్థ స్త్రీలలో అప్పుడే పుట్టిన పిల్లలనుండి మొదలుకొని ఐదు సంవత్సరాల లోపు వారికి అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను అందించడం జరుగుతుంది.

మహిళలకు, పిల్లలకు ప్రతిరోజు పాలు, గుడ్ల తోపాటు మరిన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. అయినప్పటికీని అక్కడక్కడ పోషకాహార లోపాలు మనకు కనిపిస్తున్నాయి.వాటిని అధిగమించడానికి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు మన ఇంటి వద్ద అనేక పోషక విలువలతో కూడినటువంటి పదార్థాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పాలతో పాటు డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆయా సీజన్లలో దొరికే ఆహార పదార్థాలతో పాటు మల్టీ విటమిన్లు లభించేటువంటి ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోగలుగుతాం. వీలైతే  మన ఇంటి పరిసరాలలో మనకు రోజు అవసరం ఉండేటువంటి కొన్ని కూరగాయలను పెంచుకోవాలి. పెరటి తోట ఉన్నట్లయితే అక్కడ వివిధ రకాలైననటువంటి పండ్ల చెట్లను పెంచుకొని వాటి ద్వారా వచ్చేటువంటి పండ్లను తినాలి. ఇలా మనకు కావలసినటువంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలు మనమే తయారు చేసుకుంటే మంచిది. మంచి ఆహారంతో మంచి ఆరోగ్యం వస్తుంది కాబట్టి పోషక విలువలు ఉన్నటువంటి వాటిని అందరూ తీసుకోని ఆరోగ్యంగా జీవించాలి.
-కె.లతాశ్రీనివాస్‌How

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *